సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏపీ సీఎం జగన్, ఇంగ్లిష్ నూతన సంవత్సర ప్రారంభ వేడుకలను తెలుగు సంప్రదాయం ప్రకారం నేడు, జరుపుకొన్నారు. సీఎం కార్యాలయంలో YS జగన్మోహన్రెడ్డితో సీఎస్ జవహర్ రెడ్డి కేక్ కట్ చేయించారు. ఈ క్రమంలో సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు సుఖ శాంతులు సుభిక్షం దేవుడు ప్రసాదించాలని కోరుకొంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ను నుదుట కుంకుమ దిద్ది టీటీడీ వేదపండితులు, ఇంద్రకీలాద్రి దుర్గ గుడి వేదపండితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి జగన్ కు స్వామి వారి శేషవస్త్రం , ప్రసాదాలు, టీటీడీ క్యాలెండర్, డైరీలను టీటీడీ అర్చకులు అందించారు. ఇక, దుర్గ గుడి వేదపండితులు అమ్మ వారి చిత్రపటం , క్యాలెండర్, ప్రసాదాలను ఇచ్చా రు. ఈ కార్యక్రమంలో డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దుర్గగుడి ఛైర్మన్, కరాటం రాంబాబు,తదితరులు పాల్గొన్నారు.
