సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి (గురువారం) నుంచి వారం రోజుల పాటు ఉభయగోదావరి జిల్లాలో జనసేనాని పర్యటన కొనసాగనుంది. ముందులాగ మూడు రోజుల పాటు కాకినాడ పరిసర ప్రాంతాలలో పర్యటన పూర్తీ చేసుకొన్నా తరువాత ఆయన భీమవరం లో మూడు రోజుల పాటు ఈ జనవరి 2వ వారంలో జనసేన నేతలతో సమీక్షలతో పాటు పరిసర ప్రాంతాలలో పర్యటించే అవకాశం కూడా ఉంది. భీమవరంలో తాను స్వయంగా పోటీ చేసే ఉద్దేశ్యంతో ఉన్న పవన్ పార్టీని ఇక్కడ మరింత బలోపేతం చేసే దిశగా స్థానిక ప్రముఖులతో, పార్టీ రహిత ప్రముఖులతో కూడా తన అభిప్రాయాలను పంచుకొనే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పోటీ చేసే స్థానాలపై ప్రత్యేకంగా జనసేనాధినేత దృష్టి సారించనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అభ్యర్థుల ఎంపికపై తాజా పర్యటనతో పవన్ కళ్యాణ్ పూర్తీ స్పష్టత ఇవ్వనున్నారు.
