సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా చర్చించుకునే ఘటన జరిగింది. సీఎం జగన్ కు ఆయన సోదరి మధ్య విభేదాల గురించి అందరికి తెలిసిందే.. అలాగే షర్మిల త్వరలో జగన్ తన ఆగర్భ శత్రువు గా భావించే కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరబోతున్నది అన్న విషయం కూడా తెలిసిందే.. పులివెందులలో వై ఎస్ రాజశేఖర్ కుటుంబానికి ఆగర్భ శత్రువు బిటెక్ రవిని కూడా షర్మిల భర్త ;బ్రదర్ అనిల్’ వెళ్లి కలవడం మరో సంచలనమ్.. ఇది ఇలా ఉండగా తాడేపల్లి లోని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి నేటి బుధవారం సాయంత్రం వైఎస్ఆర్ తెలం గాణ పార్టీ , అధ్య క్షురాలు, షర్మిల వెళ్లారు. ఆమె భర్త అనిల్, కుమారుడు రాజారెడ్డి, కుటుంబసభ్యు లతో కలిసి కడప నుంచి ప్రత్యే క విమానంలో గన్నవరం చేరుకుని, అక్కడి నుంచి ఇటీవల వైసిపి కి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి ని వెంట తోడుకొని షర్మిల సీఎం జగన్ క్యాంపు ఆఫీస్కు రావడంతో.. సీఎం నివాసం వైపు వెళ్లకుండా ఆర్కే వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కాసేపటికి సీఎం జగన్ నుండి ఆదేశాలు రావడంతో సీఎం నివాసం లోకి ఆర్కే ను కూడా పంపించారు. తరువాత సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వైఎస్ షర్మిల ఆహ్వానించారు. జగన్, వదిన భారతికి శుభలేఖ ఇచ్చి.. అరగంటపాటు మాట్లాడారు. భేటీ అనంతరం తాడేపల్లి నుంచి నోవాటెల్ హోటల్‌కు బయలుదేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *