సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కనీస వేతనాలు ఇవ్వాలని జీతానికి అనుగుణంగా గ్రాడ్యుటిని ఇవ్వాలని తదితర డిమాండ్లతో అంగన్వాడీలు గత 22 రోజులుగా చేస్తున్న సమ్మె భీమవరంలో నేడు, బుధవారం ఉద్రిక్తత, ఆందోళనలను కలిగించింది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇచ్చిన పిలుపుతో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు దేవాలయాలకు తరలివచ్చారు ఈ సందర్భంగా నిర్వహించవలసి ఉండగా. తెల్లవారుజాము నుంచి వ్యాప్తంగా సిఐటియు, అంగన్వాడీ లీడర్స్‌ను అరెస్టులు చేసి స్టేషన్లకు తరలించడంపై అంగన్వాడీలు కన్నెర్ర చేశారు. భీమవరం పాత బస్టాండ్ సెంటర్లో దిగిన వారిని దిగినట్లే అరెస్టులు చేయడం, తనిఖీలు చేయడం, వంటి చర్యలకు నిరసిస్తూ ..సమ్మె చేస్తున్న అంగన్వాడీల ను పోలీసులు అరెస్టుల చేస్తున్నారని ఆరోపిస్తూ.. అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని ప్రకాశం చౌక్ లో నడిరోడ్డుపై బైఠాయింపు నిర్వహించారు. ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బంది కలిగింది. చివరికి పోలీసులు అరెస్టు చేసిన నాయకుల్ని వదిలిపెట్టిన తర్వాత మునిసిపల్ ఆఫీసు వరకు ఊరేగింపు చేసి ప్రదర్శన జరుపుకోవడానికి పోలీసు అనుమతి ఇవ్వడంతో మున్సిపల్ ఆఫీస్ వద్ద సభ నిర్వహించారు.ఈ సభకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కే ఝాన్సీ లక్ష్మి అధ్యక్షత వహించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజా రామ్మోహన్ రాయ్ , యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి జి గోపి మూర్తి , ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కం శెట్టి సత్యనారాయణ, తదితర నేతలు ప్రసంగించారు.
