సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం త్యాగరాజ భవనంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అవ్వ తాతలకు జనవరి 1వ తేదీ నుండి 3000 పెంచిన వైయస్సార్ పెన్షన్ కానుక మరియు 417 కొత్త పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ను ప్రారంభించారు. సీఎం ఇచ్చిన మాటకు నిలబడే నాయకుడని, అన్నమాట ప్రకారం 2250 రూపాయల నుండి పెంక్షన్ నెలవారీ ఇస్తూ, ఏడాది ఏడాదికి పెంచుకొంటూ ఇప్పుడు 3000 చప్పున నెల నెల ఇస్తున్నారని, ఇంటికి పెద్ద కొడుకు మాదిరి ఆయన పేద కుటుంబాల బాధ్యత నెరవేరుస్తున్నారని , ఇంటిటికి వాలంటీర్లు ద్వారా పింఛను డబ్బు అవినీతికి తావులేకుండా పంపించే సీఎం జగన్ తప్ప మరెవరైనా ఎవరైనా ఉన్నారా? అని వ్యాఖ్యానించారు. నేటి గురువారం నుండి పించెను పంపిణీలు భీమవరం లో అన్ని వార్డులలోను సచివాలయ వాలంటీర్లు ప్రారంభించారు.
