సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో విజిలెన్స్ అధికారులు మరియు సివిల్ సప్లై అధికారులు నిర్వహించిన దాడులలో స్థానిక మెంటే వారి తోట లోని డోర్ నెంబర్ 5 -6-6 గుడౌన్ నందు ప్రభుత్వం పేదప్రజలకు ఇచ్చే రేషన్ కు సంబంధించినదిగా భావిస్తున్న 22 టన్నుల బియ్యం బస్తాలు , 400 కేజీ ల కందిపప్పు గుర్తించి సంబంధిత వ్యక్తులపై సిజ్ చేసి కేసు నమోదు చెయ్యడం జరిగింది. స్థానికులు ముందుగా ఇచ్చిన సమాచారం మేరకే అధికారాలు దాడులు నిర్వహించినట్లు తెలుస్తుంది.
