సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మాజీ మునిసిపల్ చైర్మెన్, స్వర్గీయ. గ్రంధి వెంకటేశ్వరరావు (GVR) ద్వితీయ వర్ధంతి సందర్భంగా నేడు, గురువారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసం వద్ద సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రావు గారు భీమవరం ప్రజలకు చేసిన సేవలు, వారితో కొనసాగించిన అనుభూతులు స్మరించుకొంటూ ఆయన తనయుడు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరియు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పుష్పమాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పి నరసింహారాజు, వైసిపి టౌన్ ప్రసిడెంట్ తోట బోగయ్య, బిసి జాతీయ సంఘం జిల్లా అడ్జక్షులు కోడె యుగంధర్ , వైసిపి జిల్లా అడ్జక్షురాలు, గూడూరి ఉమా బాల తిరుమణి ఏడుకొండలు, భీమవరం మండలం జడ్పీటిసి తదితరులు పాల్గొన్నారు.
