సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం.. రాయలం గ్రామానికి చెందిన అయితం క్రాంతికుమార్ (28) నిడమర్రులో పురుగులు మంది త్రాగి ఆత్మహత్య చేసుకోవడం సంచలనమ్ రేపింది. ప్రాధమిక విచారణలో.. క్రాంతి కుమార్ నిడమర్రు మండలం తోకలపల్లికి చెందిన గంగారత్నం తో 2018లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా క్రాంతికుమార్ చెడు అలవాట్లకు బానిసై భార్య ను కొడుతుండటంతో దంపతుల మధ్య పెద్దలు ఇటీవల రాజీ చేసినా అతనిలో మార్పు రాలేదు.దీంతో భార్య గత నెల 29న పుట్టింటికి వెళ్లి నిడమర్రు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మొన్న మంగళవారం నిడమర్రు వచ్చిన క్రాంతికుమార్ పురుగుమందు తాగి ఆత్మ హత్య కు ప్రయత్నిచాడు. అతనిని 108లో తాడేపల్లిగూడెం ఆస్ప త్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గత బుధవారం మృతి చెందాడు. భీమవరంలో అతని సన్నిహితులలో విషాదం ఆవరించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *