సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు, గురువారం పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని జగన్ అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే కేసీఆర్‌కు తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. నేటి. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి జగన్ నేరుగా నందినగర్‌లో కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో జగన్‌కు బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కేసీఆర్ నివాసానికి జగన్ చేరుకున్నారు. కేసీఆర్ నివాసం వద్ద కేటీఆర్ స్వయంగా జగన్‌ను తీసుకుని లోపలికి వెళ్లారు. కొద్దీ సేపు వారితో సీఎం జగన్ గడిపారు. అయితే కేసీఆర్‌ను జగన్ మర్యాదపూర్వకంగానే కలిశారని ఎటువంటి రాజకీయ చర్చలు జరగలేదని బిఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
