సిగ్మాతెలుగు డాట్, న్యూస్: ఈ జనవరి 22 వ తేదీన జరుగనున్న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాన మంత్రి, నరేంద్ర మోడీ గారితోపాటు పాల్గొనే అరుదయిన అవకాశం దేశంలో అతి కొద్దీ మంది ప్రముఖాలకే దక్కిందన్న విషయం అందరికి తెలిసిందే. అటువంటి గౌరవము భీమవరంలో దళిత వర్గానికి చెందిన గరికముక్కు సుబ్బయ్యఅనే శ్రీరామభక్తునికి దక్కింది. ఆయనకు అయోధ్య నుండి ఆహ్వాన పత్రిక మరియు అక్షింతలు వచ్చిన సందర్బంగా ఈ రోజు గురువారం సాయంత్రం భీమవరం క్యాంప్ కార్యాలయంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు సుబ్బయ్య ని అభినందించి సన్మానించారు ఈ కార్యక్రమంలో మంతెన రామ చంద్ర రాజు , పెద్దేటి వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
