సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్జ్యోగులు ఇటీవల చేస్తున్న ఆందోళనలు అందరికి తెలిసిందే,, అయితే వారికీ నేడు, సోమవారం ఊహించని ఝలక్ తగిలింది. పీఆర్సీపై ఏపీ జేఏసీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నేటి ఉదయం విచారించింది. ఈసందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గాయా? పెరిగాయా? చెప్పండని పిటిషన్‌ దారులను హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి సమాచారం లేకుండా పిటిషన్‌ ఎలా వేస్తారని, అయినా పీఆర్సీని సవాల్‌ చేసే హక్కు ఉద్యోగులకు లేదని స్పష్టం చేసింది. పీఆర్సీ నివేదిక బయటకు రాకుంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2:15కి వాయిదా వేసింది. ఉద్యోగ సంఘాల నేతలు తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఇక ఏపీ అడ్వకేట్‌ జనరల్‌ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. పీఆర్సీపై ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఎలా బెదిస్తారని వాదించారు. సమ్మెకు వెళ్తామని ఉద్యోగులు ప్రభుత్వాన్ని బెదిరించడమే కాకుండా కోర్టులో రిట్‌ పిటిషన్‌ ఎలా వేస్తారని ప్రశ్నించారు. గతంలో తమిళనాడులో జయలలిత ప్రభుత్వం ఫై ప్రభుత్వ ఉద్జ్యోగులు చేసిన పోరాటం అప్పడు కోర్ట్ లు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడటం తదితర ఘటనలు ఇక్కడ పునరావృత్తం అవుతాయా? వేచిచూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *