సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం కెసిఆర్ గతంలో అసెంబ్లీ లో మాట్లాడిన వాస్తవాలు చెప్పాలంటే.. వై యస్ రాజశేఖర్ రెడ్డి మరణించాక కాంగ్రెస్ పార్టీ ఆతని కుమారుడిని రాంగ్ హ్యాండలింగ్ చేసి అతనిపై కేసులు బనాయించి జైలుకు పంపింది. అయితే అతను దమ్ముగా తన ఎంపీ పదవికి రాజీనామా చేసి 5లక్షల పైగా దేశంలో అత్యధిక మెజారిటీ తో కడప నుండి గెలవడం, జగన్ కోసం కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మరల ఉపఎన్నికలలో వైసీపీ నుండి పోటీ చేస్తే వారి దెబ్బకు అవతల పార్టీల డిపాజిట్స్ గల్లంతు కావడంతో కాంగ్రెస్ అధిష్టానం జగన్ కు భయపడి అతని ప్రభావం నుండి తెలంగాణ నైనా కాపాడుకొందామని తెలంగాణ విభజన చేసిందే తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రజలపై అభిమానంతో కాదు.. అసలైన కాంగ్రెస్ వాదులు జగన్ వెంట ఏపీ వెళ్లిపోయారు. ఇప్పడు ఉన్నది డూప్లికేట్ కాంగ్రెస్.. అని కుండబ్రద్దలు కొట్టారు. మరి తదుపరి పరిణామాల నేపథ్యంలో .. జగన్ సోదరి షర్మిల తాజగా గా కాంగ్రెస్ తీర్ధం తీసుకొన్నారు. మరి ఏపీలో జగన్ వెంట రూపు మార్చుకున్న కాంగ్రెస్ పార్టీని తిరిగి షర్మిల సారథ్యంలో పునర్జీవింప చెయ్యాలని కాంగ్రెస్ తాజా ప్యూహంగా కనపడుతుంది. ఏ వై యస్ కుటుంబం వల్ల ఏపీ ప్రజలకు కాంగ్రెస్ దూరం అయ్యిందో అదే కుటుంబం నుండి వచ్చిన షర్మిలతో గతించిన పార్టీని పునర్జీవించే యోచన స్వష్టం అవుతుంది. వైసిపి లో వచ్చే ఎన్నికలలో టికెట్స్ రానివారికి మరో ఆప్షన్ గా వై ఎస్ షర్మిల కాంగ్రెస్ ను చూపిస్తుంది. దానిలో భాగంగా రాజశేఖర్ రెడ్డి చెరిష్మా క్రమక్రమంగా వైఎస్సార్‌సీపీకి దూరమవుతోందనే అర్థం వచ్చేలా ఏపీ కాంగ్రెస్ తాజగా ఒక ఫొటోని షేర్ చేసింది. ‘మీకు అర్థమవుతోందా?’ అనే ట్యాగ్‌ను ఏపీ కాంగ్రెస్ జోడించింది. ఏది ఏమైనా ఏపీ ప్రజలకు కాంగ్రెస్ చేసిన ద్రోహం క్షమించతగినదా?కనీసం 7శాతం ఓట్లను వెనక్కు రాబట్టిన జగన్ కు అధికారంపై దూరం చేసే ఫ్యుహం లో షర్మిల భుజాలపై తుపాకీ పెట్టి జగన్ అధికారాన్ని కాల్చాలనే తీరున కాంగ్రెస్ కనపడుతుంది. పరోక్షముగా టీడీపీ జనసేన కూటమికి మేలు జరిగే యోచనగా విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాలు అంటే ఇదేనా.. సిగ్మా ప్రసాద్ కాలమ్స్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *