సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మున్సిపల్ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 11 రోజులుగా తీవ్రతరం చేస్తున్నారు. సమ్మె చేస్తున్న కార్మికులను రెచ్చగొట్టే విధంగా పారిశుద్యం కోసం భీమవరంలో పోటీ గా ప్రవేటు కార్మికులు తీసుకురావడానికి సిఐటియు ఏఐసిటియు నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకించాయి . నేడు, శుక్రవారం పట్టణం లోని ఏడు డివిజన్ లలో కార్మికులు, నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు..పలు కూడలిలో సమ్మె ఎందుకు చేయవలసి వచ్చిందో ప్రజలకు తెలియచేసారు..తమ స్ధానం లో పనికి వచ్చిన కొందరు పోటీ కార్మికులను వెళ్లి పోవల్సిందిగా కోరారు..ఇకపై తమ పనుల స్థానం లోకి పనికి పోటీగా వస్తే ఊరుకోమని హెచ్చరించారు..ఈ నేపధ్యంలో ఎక్కడికక్కడ పనిముట్లు వదిలివేసి ప్రవేటు కార్మికులు వెళ్లిపోయారు.. భీమవరం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మున్సిపల్ సమ్మె శిబిరంను ప్రారంభించారు. నేడు, శుక్రవారం బైక్ ర్యాలీ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి వాసుదేవరావు మాట్లాడుతూ.. అధికారులు ద్వారా సమ్మె విచ్చిన్నం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని అయితే కార్మికులు పోటీ చర్యలను ఐక్యంగా తిప్పికొడతారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ,ఇంజనీరింగ్ సెక్షన్ లో ప్రధానంగా వాటర్ వర్క్స్ ఎలక్ట్రికల్ కార్మికులు చెత్త టాక్టర్లపై పనిచేస్తున్న డ్రైవర్లు క్లాప్ డ్రైవర్లు కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు, మునిసిపల్ కార్మికుల న్యాయమైన కోర్కెలు శాంతియుతంగా పరిష్కారం చేయాలని లేని పక్షంలో అత్యవసర సేవలు కూడా నిలుపుదల చేస్తామని హెచ్చరించారు ఈ ధర్నాలలో జేఏసీ నాయకులు జి నాని నీలాపు రాజు బంగారు వరలక్ష్మి నీలాపు విశ్వనాథం నిమ్మకాయల ధనలక్ష్మి ధనాల చినపెధ్ధిరాజు తదితరులు పాల్గొన్నారు
