సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఒక ప్రక్క రాష్ట్రంలో నిధుల కొరత తీవ్రంగా ఉందంటున్నారు.మరోప్రక్క సీఎం జగన్ మాత్రం తగ్గేదే లే.. అంటున్నారు. తాజాగా నేడు.. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. నేడు, మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి మొత్తం 3,92,674 మంది అగ్రవర్ణాలు లోని పేద మహిళలకు రూ.589 కోట్లను వారి ఖాతాల్లో జమచేశారు. ఈ పథకం ద్వారా. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న ఒక్కో పేద మహిళకు ఏటా రూ.15 వేలు చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు ఆర్థికసాయం అందనుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈబీసీ నేస్తం ద్వారా అగ్ర వర్ణ పేదల మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్యులు, క్షత్రియులు, వెలమతోపాటు ఇతర అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సాయం చేకూరనుందన్నారు. ఈ బీసీ నేస్తం పథకం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం కాదని.. అయినా అగ్ర వర్ణ పేద మహిళలకుమెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యమని పేర్కొన్నారు.
