సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం లో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ నేడు, మంగళవారం దిరుసుమర్రు హరిజనవాడ నుండి కోమటితిప్ప వరకు ఇటీవల 9 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన సుమారు 6 కిలోమీటర్లు (5.8 km)బీటీ మరియు సిసి రోడ్ ను స్థానిక నేతలు ప్రజలు సమక్షంలో ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పుష్పాభిషేకాల మధ్య.. స్థానికుల హర్షదానాల మధ్య మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలంగా ఇక్కడ ప్రజలు చేసిన విజ్ఞప్తులు గత ప్రభుత్వం పట్టించుకోకపోయిన నా హయాంలో సీఎం జగన్ సహకారంతో ఏకముగా 9 కోట్ల నిధులతో ఇక్కడ గుంతలు పడిన రోడ్డు స్థానంలో సరికొత్త రోడ్డును ఇంత పెద్ద ఎత్తున నిర్మించి మీ సమక్షంలో ప్రారంభించడం మీకు ఇచ్చిన హామీని నెరేవేర్చినందుకు గర్వముగా ఉందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *