సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్ధిక బడ్జెట్ లో రైల్వే శాఖ కు జరిగిన బడ్జెట్ కేటాయింపులను ముఖ్యంగా తెలుగురాష్ట్రాల్లో రైల్వే లకు సంబంధించి మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియా కు వివరించారు. రైల్వే బడ్జెట్ లో తెలంగాణలో రైల్వే ల అభివృద్ధికి రూ.5,071 కోట్లు ప్రకటించారు. రాష్ట్రంలో 100శాతం విద్యుదీకరణ పూర్తయిందని రైల్వేమంత్రి అశ్వి నీవైష్ణవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏపీలో రైల్వే ల అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రూ.9138 కోట్లు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. 2009 నుంచి 2014 వరకు (కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో)కేవలం రూ.886 కోట్లుఇచ్చినట్లు తెలిపారు. ఎన్డీయే లో అధికారంలోకి వచ్చాక అప్పటి నుంచి నిధులు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఏపీలో ఏడాదికి 240 కి.మీ ట్రాక్ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే. ఏపీలో 98 శాతం విద్యుద్దీకరణ పూర్తి అయినట్లు తెలిపారు. విశాఖ రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వా న్ని అడిగినట్లు కానీ ఇంకా ఏపీ ప్రభుత్వం ఆ భూమి తమకు కేటాయించలేదని… రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తిచేసి కేం ద్రానికి భూమి అప్ప గిస్తే పనులు ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే రైల్వే జోన్ ఏర్పా టు కోసం డీఎపీఆర్ సైతం సిద్ధమైందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *