సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని సేవలలలో పాల్గొని తరించాలని హిందువులు తపిస్తుంటారు. మరి అన్యమతస్తులలో కూడా శ్రీనివాసుని భక్తులు చాలామంది ఉంటారు. వారు కూడా తిరుమలలో హిందూ భక్తులతో పాటు కూడా స్వామి వారిని దర్శించుకుంటారు. అయితే తిరుమలకు వచ్చే హిందూయేతరులు.. ‘‘మాకు శ్రీవారిపై సంపూర్ణ నమ్మకం ఉంది’’ అంటూ డిక్లరేషన్ సమర్పించి స్వామి వారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. అయితే శ్రీవారి సేవలో పాల్గొంటామంటూ.. ఆ భాగ్యాన్ని తమకు కల్పించాలని ఇటీవల చాల మంది అన్యమతస్థ భక్తుల నుంచి టీటీడీకి విజ్ఞప్తులు వసున్నాయి. .ఈ నేపథ్యంలో అన్యమతస్థ భక్తులకు తాజాగా టీటీడీ (TTD) శుభవార్త చెప్పింది. త్వరలోనే ఆఫ్లైన్లో అన్యమతస్థ భక్తులను శ్రీవారి సేవకు అనుమతిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. సెక్యూరిటీ విభాగం సూచనల మేరకు హిందూయేతరులను శ్రీవారి సేవకు అనుమతించడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనికోసం ఓ ప్రత్యేక కమిటీని నియమించి వారీ సూచనల మేరకు అన్యమతస్థులను శ్రీవారి సేవకు అనుమతించడంపై నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఈవో తెలిపారు.జనవరి మాసంలో 21 లక్షల 09 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. హుండీ ద్వారా రూ. 116.46 కోట్ల ఆదాయం లభించిందని తెలిపారు. కోటి 3 లక్షల లడ్డులను భక్తులకు విక్రయించామని.. 46 లక్షల 46 వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశామన్నారు. 7 లక్షల 5వేల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారన్నారు. రేపటి (శనివారం) నుంచి మూడు రోజుల పాటు ధార్మిక సదస్సుని నిర్వహిస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
