సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: పేద ప్రజలకు ఎంత సంక్షేమం అందిస్తున్న కూడా జగన్ సర్కార్ హయాంలో ..నెలకు సగటున 300 యూనిట్స్ పైగా కరెంట్ వినియోగించే మధ్యతరగతి ప్రజలకు, కస్టపడి, అప్పు చేసి స్వయంగా 3సెంట్ల పైగా ఇల్లు కట్టుకున్న సరే.. ఆరోగ్యశ్రీ, మినహా చాల సంక్షేమ పధకాలు,పలు పింఛను లు, పిల్లల చదువులుకు అమ్మవడి, జగనన్న దీవెన , వసతి దీవెనలు అన్ని దూరం.. ఇక వారికీ ఇంటి, కుళాయి పన్నులు ,కరెంట్ చార్జీల బాదుడు మాత్రం రాను రాను పెరిగిపోతుంది.ఇది ప్రభుత్వం ఇప్పటికైనా గమనించాలి. భీమవరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తీరు .. నిజానికి చలి కాలంలో ఎక్కడైన విద్యుత్ వినియోగం తగ్గుతుంది. దానితో కరెంట్ బిల్లులు తగ్గటం పోయి కరెంటు బిల్లులు రాగానే హడలి పోతున్నారు. కనీసం 200 – 300 యూనిట్స్ వాడే మధ్య తరగతి ప్రజలు. భీమవరం విద్యుత్తూ అధికారులకు ఫోన్ చేసిన స్వయంగా సంప్రదించిన సరే.. వచ్చిన బిల్లు తగ్గించుకోలేని పరిస్థితి. అసలు వినియోగానికి తోడు ఒకేసారి మూడు సర్దుబాటు ఛార్జీలను మోపుతుండడం తో వినియోగదారులు బెంబేలు ఎత్తుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వారి నిర్లక్ష్యం వల్ల, పెట్టిన బకాయిల వల్ల విద్యుత్ డిస్కామ్ వ్యాపారానికి సంబంధించి 2014-15 నుంచి 2018-19 కాలంలో డిస్క మ్ లో నష్టాలు వచ్చాయని ఆ నష్టాలు ఇప్పుడు ప్రజలు భరించాలని అందుకే ట్రూఆప్ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు.. ఆ కాలంలో వినియోగించుకున్న ప్రతి యూనిట్ కు 22 పైసలు చొప్పున లెక్క గట్టి బిల్లులో విధిస్తున్నారు. నిజానికి 2022 ఆగస్టు నుంచి ఈ రీతిన బిల్లులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సంబంధిత నెలలో వాడుకున్న విద్యుత్తుపై తర్వాత నెలలో వచ్చే బిల్లులో లెక్కించి ఎఫ్పీపీసీఏ 2 ఛార్జీలు విధిస్తున్నారు. ఒక్కో యూనిట్కు 40 పైసలు చొప్పున లెక్కించి వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇక వేసవి వస్తుంది. ఇంకెంత బిల్లులు చెల్లించాలో దేవుడా? అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళా అయిన మధ్య తరగతి ప్రజలకు కొన్ని రాయితీలు ఇస్తే మంచింది, ఈ వేసవి గట్టెక్కుతారు.. సిగ్మా ప్రసాద్ కాలమ్స్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *