సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవాలు ముగింపు నేపథ్యంలో రేపు శుక్రవారం దేవాలయ ఆవరణలో అఖండ అన్న సమారాధన నేపథ్యంలో దేవాలయం కు వచ్చే అన్ని వైపులా భక్తుల రాకకు మినహా అన్ని రోడ్డు వాహనాలు రాకుండా కర్రలతో నిర్మించిన బారికేడ్స్ తో తాత్కాలికంగా నేటి గురువారం సాయంత్రం నుండి రేపటి సాయంత్రం వరకు రోడ్స్ బ్లాక్ చేసారు. ఇక సుమారు లక్ష మందికి అన్నసమారాధన ఏర్పాట్లు కోసం భారీ పొయ్యలపై వంట పాత్రలు , రాసులుగా పోసిన కూరగాయలు తో విభిన్న రుచుల వంటకాలకు ఏర్పట్లు ప్రారంభమయ్యాయి. ( ఫై తాజా చిత్రంలో ) సాంబారు, పులిహోర, బూరెలు తదితర వంటకాలు నేటి రాత్రి నుండే ప్రారంబిస్తున్నారు. రేపు ఉదయం7-35 కు శ్రీ అమ్మవారి మహా నైవేద్య సమర్పణ తదుపరి 8 గంటలకు అన్నసమారాధన ప్రారంభం అవుతుంది. నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దాతలు భూరి విరాళాలతో విశేషంగా వారికీ సహకరిస్తున్నారు.
