సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 60 వ వార్షిక మహోత్యవాలు ఇటీవల ముగిసిన నేపథ్యంలో గత 33 రోజులలో భక్తులు కానుకలు సమర్పించిన 9 హుండీలను నేడు, సోమవారం తెరచి లెక్కించగా మొత్తం ఆదాయం, రూ. 63,98,749 అక్షరాల అరవై మూడు లక్షల తొంబై ఎనిమిది వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు వచ్చింది. భక్తులు హుండీ ద్వారా, బంగారం 68గ్రా 800 మి గ్రాములు. వెండి 221 గ్రాములు శ్రీ అమ్మవారికి సమర్పించుకున్నారు. మిగిలిన హుండీలను రేపు మంగళవారం అనగా 13-02-2024 ఉదయం తెరిచి లెక్కించబడును ఈ యొక్క లెక్కింపు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి యర్రంశెట్టి భద్రాజీ ఆద్వర్యo లో తనిఖీదారువారు వి వెంకటేశ్వరరావు ఈఓ కర్రీశ్రీనివాస్, ఈఓ ఎం అరుణ్ కుమార్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మన్ మానేపల్లి నాగేశ్వరరావు(నాగన్న బాబు) పర్యవేక్షించారు.
