సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : తెలుగుదేశం , జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్య ర్థుల తొలి జాబితా నేడు, శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విడుదల చేసారు. ఉండవల్లి లోని చంద్రబాబు నివాసం లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నా రు.: తెలుగుదేశం , జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఫస్ట్ జాబితాలో మొత్తం సీట్లకు గాను అభ్యర్థులను ప్రకటించారు. ఈ జాబితాలో మొత్తం 99 స్థానాలను ప్రకటించగా.. ఇందులో టీడీపీకి 94, జనసేనకు 05 స్థానాలు ఉన్నాయి. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లా నుండి గతంలో మన సిగ్మా న్యూస్ లో తొలిసారి ప్రకటించినట్లు గా ఆచంట – పితాని సత్యనారాయణ, పాలకొల్లు – నిమ్మల రామానాయుడు, ఉండి – మంతెన రామరాజు, తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ ను ప్రకటించగా, ఏలూరు జిల్లా నుండి ఏలూరు – బాదెటి రాధాకృష్ణ, చింతలపూడి – సోంగ రోషన్, నూజివీడు -కొలుసు పార్థసారథి ను అధికారికంగా ప్రకటించారు. అయితే కుప్పం నుండి చంద్రబాబు పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం భీమవరం నుండి పోటీ చేస్తున్నట్లు ఈ లిస్ట్ లో ప్రకటించలేదు. జనసేన మాత్రం కేవలం 23 స్థానాలలో మాత్రమే పోటీ చేస్తున్నట్లు 3 లోక్ సభ స్థానాలలో పోటీ చేస్తున్నట్లు పవన్ అధికారికంగా ప్రకటించడం జనసేన శ్రేణులను నిరాశ పరిచింది.
