సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ హయాంలో విశాఖ రాజధాని అయితే ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ నుండే నిర్వర్తిస్తారని భావిస్తున్న నేపథ్యంలో.. విశాఖపట్నంలో రుషికొండ ప్రాంతంలో నిర్మించిన భవనాలను ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభోత్సవం చేసింది. సీఎం జగన్ కు ఆత్మీయ గురువుగా భావించే స్వరూపానంద సరస్వతి ఆధ్వర్యంలో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, ఇతర మంత్రులు, వైవి సుబ్బారెడ్డి తో కలిసి నేడు, గురువారం రుషికొండ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. సువిశాలమైన ప్రాంతంలో వీటిని నిర్మించినట్టు చెప్పారు. ప్రభుత్వ భవనమైనా సాంప్రదాయ పద్ధతిలోనే ప్రారంభ వేడుక చేశామని తెలిపారు. అన్ని రకాల మత ప్రార్ధనలు నిర్వహించారు.
