సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో కాస్త ఒడిదుడుకులు ఉన్న, వాతారణం కూడా అనుకూలంగా ఉంది చెరువులలో సాగుతో పాటు, రొయ్య, చేప రేట్లు కాస్త అటు ఇటుగా ఉండి ఎగుమతులు జరుగుతుండటంతో రాష్ట్రంలో అత్యధిక సాగు చేసే భీమవరం పరిసర ప్రాంత మరియు కృష్ణ జిల్లావరకు ఆక్వా రైతులు మెల్లగా కోలుకొంటున్నారు. అయితే ఊహించని విధంగా కొద్దీ రోజులుగా రొయ్య రేటు దిగి వస్తుండటంతో పాటు ఒక్కసారిగా ఆక్వా మేతల ధరలు పెరగడం, చేపలు, రొయ్యల ధరలు కాస్త తగ్గడంతో ఆక్వా రైతులు నష్టాల పాలవుతున్నారు. చేపల మేత డీవోబీ తవుడు మార్కెట్‌లో పది టన్నుల ధర రూ.1.70 లక్షలు పలుకు తోంది. మొన్నటి వరకు రూ.1.20 లక్షలు ఉన్న తవుడు అమాంతంగా యాభై వేలు పెరిగింది అని రైతులు చెబుతున్నారు.. రొయ్యల మేత కేజీ మొన్నటి వరకు రూ.70 ఉండగా, సుమారుగా రూ. 90-100 వరకు పెరిగింది. చేపల మేత పది టన్నులకు రూ.50 వేలు, రొయ్యల మేత కిలో రూ.30 చొప్పున పెరగగా మరోవైపు చేపల, రొయ్యల ధరలు దిగి వస్తుండటం తో రైతులు ఆందోళలన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో పనిచేసే ఆక్వా.. సమన్వయ కమిటీ పెద్దలు దీనిపై సమీక్ష చేసి ఆక్వా పీడ్స్ సంస్థలతో మాట్లాడి రేట్ల ను అదుపులోకి తేవాలని ఆక్వా రైతులు కోరుతున్నారు.
