సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ ప్రఖ్యాత”సోనీ పిక్చర్స్” నిర్మాణంలో, తెలుగులో తొలిసారిగా పాన్ ఇండియా స్థాయిలో ఎయిర్ ఫోర్స్ యుద్ధం నేపథ్యంలో ఆపరేషన్ వాలెంటైన్ సినిమా పేక్షకుల ముందుకు వచ్చింది. హీరోగా వరుణ్ తేజ్, మానుషి చిల్లర్, నవదీప్, అలీ రేజా, సర్వర్, అభినవ్ గోమాటం ముఖ్య పాత్రలతో, మిక్కీ మేయర్ సంగీతంలో కెమెరా హరి కె వేదాంతం నిర్వహించిన ఈ సినిమాకు రచన, దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ హదా వహించారు. అయితే ఇటీవల హిందీలో హిట్ సాధించిన హుట్రిక్ రోషన్ ‘ఫైటర్’ కి ఈ ‘ఆపరేషన్ వాలెంటైన్’ కి కొన్ని పోలికలు కనపడటం విశేషం. ఇక సినిమా కధ విషయానికి వస్తే.. అర్జున్ రుద్ర దేవ్ అలియాస్ రుద్ర (వరుణ్ తేజ్) భారత వైమానిక దళంలో స్క్వాడ్రన్ లీడర్, యుద్ధ పైలట్ కూడా. ధైర్య సాహసాలకు పెట్టింది పేరు, అతని ప్రియురాలు అహన (మానుషి చిల్లర్) రాడార్ ఆపరేటర్ గా వైమానిక దళంలోనే పనిచేస్తూ ఉంటుంది. అర్జున్ ప్రాజెక్ట్ వజ్ర సరిగా పని చేస్తోందో లేదో అని టెస్ట్ చేసే సమయంలో అతని మిత్రుడు (నవదీప్) ని కోల్పోతాడు. ఆ తరువాత పాకిస్తాన్ కి చెందిన టెర్రరిస్టులు కాశ్మిర్ లో పుల్వామా వద్ద భారత సైనికులను తీసుకు వెళుతున్న ట్రక్కులపై దాడి చేస్తారు, ఇందులో 40 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోతారు. దీనికి ప్రతిగా భారత వైమానిక దళం వజ్ర ప్రాజెక్ట్ ఆపరేషన్ ప్లాన్ చేస్తుంది. అది ఎలా అమలు చేస్తారు,అన్నది వెండి తెరపై చూడాల్సిందే.ఈ సినిమాకు చాలా క్వాలిటీ కంప్యూటర్ గ్రాఫిక్స్ అవసరం, కానీ ఆ విషయంలో కొంత అసంతృప్తి మిగులుతుంది. దీనితో పాటు దేశభక్తి అనే భావోద్వేగాలు ఎక్కువగా కనిపించాలి. అక్కడక్కడ చిన్న చిన్న లోటుపాట్లు వున్నా తెలుగు సినిమాలో ఇటువంటి కథా నేపథ్యం ఉన్న సినిమా తీయడం హర్షించదగ్గ విషయమే. దర్శకుడు తనకు ఇచ్చిన బడ్జెట్ లో బాగానే పనితనం చూపాడు.. సినిమా కలెక్షన్స్ కొల్లగొట్టడం మాట అటుంచి వరుణ్ తేజ్ చక్కటి పాత్రను ఎంచుకోవడమే కాదు చక్కగా ఆర్మీ అధికారిగా ప్రేక్షకులకు గుర్తుండిపోతాడు..
