సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో వైసిపి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో .. ఇటీవల టీడీపీ జనసేన మొదటి అభ్యర్థుల లిస్ట్ విడుదల చేసాక తాజగా జరుగుతున్నా రాజకీయ పరిణామాలను కేంద్రం లోని బీజేపీ నిశితంగా గమనిస్తుంది. టీడీపీ-జనసేన కూటమిలో ‘చేరేది- లేనిది ‘ఇంకా పరిశీలిస్తున్నట్లు, వారిని టెంక్షన్ పెడుతూ.. బీజేపీ తో అవసరం వాళ్ళది నిర్ణయం చెప్పేవరకు వెయిట్ చేస్తారు.. చాపక్రింద నీరులా ఏపీలో ఈ ఎన్నికలలో స్వతంత్రంగా బలపడేందుకు ఓట్ల శాతం భారీగా పెంచుకొనేందుకు బీజేపీ పుహరచన చేస్తున్నట్లు తాజా సమాచారం.. దీనిలో భాగంగా రాష్ట్రంలో సుమారు 25 శాతం ఓట్లు ఉన్నట్లు భావిస్తున్న కీలక కాపు,తూర్పు కాపు, బలిజ తదితర ఓట్లను పొందేందుకు కాపు నేతలను ఎక్కువ గా ప్రోత్సహించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పక్రియ వచ్చే ఎన్నికలలో అధికార వైసిపి కి మేలు చేసేలా టీడీపీ జనసేన కు బీజేపీ భారీ షాక్ ఇస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యం లో టికెట్స్ రాక భంగ పడ్డ టీడీపీ, జనసేన, వైసీపీ నుంచి కనీసం 30 కి పైగా కీలక నాయకులు బీజేపీ అగ్ర నాయకుల్ని ఇప్పటికే కలిసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గచ్చి బౌలిలో బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్, శివప్రకాశ్ జీ నేతృ త్వంలో పొత్తుపై కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సోము వీర్రాజు తో పాటు కీలక బీజేపీ నేతలు అందరు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రేపటి నుండి విజయవాడలో 2, 3వ తేదీల్లో ఏపీలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ముఖ్య నాయకులుతో సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతము పొత్తులపై ఎవరూ మాట్లాడకూదని కూడా ఆదేశాలు ఇచ్చారని తెలిసింది. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సమాయత్తం కావాలని నేతలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *