సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొత్తానికి ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 4 ప్రాంతాలలో ‘సిద్ధం’ సభలకు భారీ ఎత్తున వైసిపి శ్రేణులు ప్రజలు తరలి వచ్చి సముద్ర కెరటాలలాగా సీఎం జగన్ ను చూడగానే ఉవ్వెత్తున లెగిసిన సన్నివేశాలు జాతీయ మీడియా ఛానెల్స్ కూడా నివ్వెరపోయేలా ప్రత్యక్ష ప్రసారం చేసాయి. సభలకు వచ్చిన వారంతా ఓట్లు వేస్తారా? అంటే మాత్రం ఎవరు హామీ ఇవ్వలేం.. జనాన్ని తరలించడానికి చేసిన ప్రయత్నాలలో గతంలో అధికారం అనుభవించిన అన్ని పార్టీల లాగే వైసిపి అధికార దుర్వినియోగం చేసింది అన్నది యదార్ధం.. జగన్ కు ఉన్న ప్రజాబలం తెలుసుకాబట్టే.. అపర చాణుక్యుడు, చంద్రబాబు జనసేన తో పాటు కేంద్రం లోని బీజేపీ మద్దతు కోసం అన్ని పాట్లు పడ్డారన్నది యదార్ధం.. జనసేనాని కూడా వైసిపి పైకి సింగిల్ గా ఏ పార్టీ వెళ్లిన వీరమరణమే .. అని బహిరంగంగా ప్రకటించారు. 2014 ఎన్నికలలో సైతం! వైసిపి అధికారం ‘కేవలం 5లక్షల ఓట్లు’ పైచిలుకు దూరంతో ‘కూటమి’ తో ఓడిపోయిన.. ‘రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు బలం కలిగి ఉన్నసింగిల్ పార్టీ’ అన్నది యదార్ధం.. 2014 ఏపీలో సీట్ల పరంగా మాత్రమే కూటమి గెలిచింది. ఇంత జరిగిన కానీ తెలుగుదేశం యువనేత లోకేష్ కి తత్వం అర్ధం కాలేదు.. తాజాగా విడుదల చేసిన ట్విట్ లో మేదరమెట్ల వైకాపా ‘సిద్ధం’ సభలో చూపించిన జనమంతా గ్రాఫిక్స్ అంటూ ఎక్స్ (ట్విటర్) వేదికగా పోస్టు చేశారు. ఒక గుంపు జనాన్ని పలుచోట్ల అమర్చారంటూ కొన్ని ఫొటోలను ఆయన పెట్టారు. ఏకంగా మార్ఫింగ్ ఫొటోలు వేసిన వైనం చరిత్రలో ఎప్పు డైనా చూశారా?అని ప్రశ్నించారు. జగన్కు ప్రజల మద్దతు లేదని.. ఎంత ప్రయత్నించిన ఆయన్ను చిత్తుగా ఓడించడం ఖాయమని లోకేశ్ తనదైన శైలి లో వ్యాఖ్యానించారు. ‘సిద్ధం’ మించిన సభ ఏర్పాటు చేసి సత్తా చూపించాలి కానీ.. టీడీపీ వర్గాలకే మింగుడు పడటం లేదు లోకేష్ తత్వం..
