సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కాకినాడ జేఎన్టీయూకే ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్,అగ్రికల్చర్, ఫార్మసీకామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఈఏపీసెట్) -2024 నోటిఫికేషన్‌ను గత సోమవారం విడుదల చేసినట్లు ఏపీఈఏపీసెట్ చైర్మన్, జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు. దీనికి సంబందించిన దరఖాస్తులను విద్యార్థుల నుండి మంగళవారం నుంచి స్వీకరిస్తున్నామన్నారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 15 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మే13 నుంచి 19 వరకూ ఆన్‌లైన్ విధానంలో పరీక్షలను నిర్వహిస్తామని ఏపీలో 47, హైదరాబాద్‌లోని ఎల్భీ నగర్, సికింద్రాబాద్‌లలో రెండు కేంద్రాలు, మొత్తం 49 ప్రాంతీయ కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించనున్నామన్నారు
