సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘తాను భీమవరం సిటు వదులుకోనని అక్కడ ఎన్ని కోట్లు ఖర్చు అయిన గెలవాల్సిన సిటు‘ అంటూ స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫై చేసిన తీవ్రఆరోపణలు.. నేపథ్యంలో.. భీమవరంలోని తన కార్యాలయంలో ప్రభుత్వ విఫ్, MLA గ్రంధి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. పవన్ రోజుకో రకంగా మాట్లాడే మాటలు సమాజానికే ప్రమాదకరం. మొన్న భీమవరం వచ్చినప్పుడు గ్రంధి.. మీద వ్యక్తిగతముగా ఎటువంటి కక్ష లేదు.. అన్నవాడు, ఇప్పుడు గుండా.. రౌడీ.. అంటూ.. రెచ్చిపోవడం తో పవన్ మానసిక స్థితి ఆశ్చర్యం కలిగిస్తుందని డాక్టర్లకు చూపించుకొంటే మంచిదని లేకపోతె కొద్దీ కాలానికే మంచి సినిమా నటుడుని ప్రజలు కోల్పోయే అవకాశం కూడా ఉందని సెటైర్ వేశారు. నాపై ఇప్పటివరకు ఒక్క క్రిమినల్ కేసు లేకపోయిన పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉండే పవన్ కు తోడు.. ఒక్కో ఎన్నికకు ఒకో పార్టీ నుండి పోటీ చేసే అంజిబాబు ఇద్దరు 2019 ఎన్నికలు అయ్యాక మీకు ఓట్లు వేసిన ప్రజలను మర్చిపోయి ఈ 5 ఏళ్ళు తిరిగారని, కనీసం కరోనా సమయంలో ఎవరికైనా ఒక్కరికి సహాయం చేసారా? అని ప్రశ్నించారు. అంజిబాబు ఎమ్మెల్యేగా పదవిలో ఉన్నపుడు చేసిన అభివృద్ధి ఏమి లేదు.. రైతులను మోసం చేసి పొలాలు కొనుకొన్నాడు.. ఆయన మల్టి ఫ్లెక్స్ ముందు ఉన్న మునిసిపల్ స్థలం ఆక్రమించి సైకిల్ స్టాండ్ రుసుములు వసూళ్లు చేశాడు ..ఎవడికి కష్టం వచ్చిన ఆదుకున్నది లేదు.. అటువంటి మీరు ఎన్నికల ముందు వచ్చి నన్ను విమర్శిస్తూ.. భీమవరంలో పవన్ స్థలం కొనకుండా అడ్డుకున్నానని బ్రహ్మనందం లా కామిడి మాటలు చెప్పితే ఎవరు నమ్మరు.. నీకు నా ఇంటి ప్రక్కన స్థలం కొనిపిస్తాను.. లేదా ఇల్లు కట్టిస్తాను .. డబ్బుతో ఎవడు వచ్చిన భీమవరంలో స్థలం కొనుక్కోగలరు. సౌమ్యుడు, చిరంజీవికి.. పవన్‌కు అసలు పోలికే లేదు. చిరంజీవి ఎన్నికల్లోపోటీ చేసి 18 సీట్లు గెలిచారు. పవన్ జనసైనికుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టావు. మొన్న CM సీట్ అన్నావ్, నిన్న 24 సీట్లు ఇచ్చారన్నావ్.. నేడు చంద్రబాబు కాళ్లు, చేతులు పట్టుకుని 21 సీట్లు తీసుకున్నావ్.. నిన్నుసీఎం గా చూడాలనుకున్న జనసైనికులతో.. పార్టీ లేదు.. తొక్కా లేదు.. 10 మందికి బోజనమ్ పెట్టలేని మనం ఎన్నికలలో పోటీ చెయ్యలేం అన్నావ్, కార్యకర్తలును అవమానించి, ఇష్టం లేకపోతె పార్టీ నుంచి దొబ్బెయ్ అంటున్న ‘పవన్ రౌడీ’ బాషా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మరో సొంత అన్న నాగబాబుకి కూడా పవన్ అన్యాయం చేశారు. నేను ఎమ్మెల్యే గా ఉండగానే పెద్ద పెద్ద సంస్థలన్నీ భీమవరం వచ్చాయి. అభివృద్ధిని పరుగులు పెట్టించాను. భీమవరం ప్రజలుకు అన్ని తెలుసు.. వచ్చే ఎన్నికలలో సీఎం జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమంతో నా గెలుపు ఖాయం అని ఎమ్మెల్యే గ్రంధి వ్యాఖ్యానించారు.
