సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో వైసీపీ నేతలుగా కొనసాగుతున్న, భీమవరం మారుతి సెంటర్లోని దాసాంజనేయ స్వామి గుడి చైర్మన్ , పరిచూరు నాగేశ్వరరావు తన పదవికి రాజీనామా చేసి మరియు ప్రముఖ వ్యాపారులు, పూసరపు సుబ్బారావు , చలపతి రావు కలసి నేడు, గురువారం జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు మరియు జనసేన పార్టీ మరియు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు సమక్షంలో జనసేన పార్టీ లో చేరిపోయారు. ఈ కార్యక్రమంలో పులపర్తి అంజిబాబు, చెనమల్ల చంద్రశేఖర్ ,మాజీ కౌన్సిల్ ప్లోర్ లీడర్, గాదిరాజు తాతరాజు, సుంకర రవి, , వబిలిశెట్టి రామకృష్ణ , బండి రమేష్ కుమార్, వానపల్లి సూరిబాబు, మగపూ ప్రసాద్,తదితర జనసేన నేతలు పాల్గొన్నారు.
