సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాపు ఉద్యమ నేత, ఇటీవల వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం కిర్లంపూడిలో నేడు, మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలలో పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆయన ఓటమికి సిద్దపడి ఉండాలని .. ఎన్నికలంటే సినిమాలు కాదని, చంద్రబాబు ను ఎత్తడం కోసం ఆవేశంగా ప్రసంగాలు చేసినంత మాత్రాన ఓట్లు పడవని, చంద్రబాబు మోసాలు ప్రజలకు తెలుసునన్నారు. రాజకీయాల్లో వపన్ కంటే చిరంజీవే బెటర్ అని చెప్పారు. పవన్ జైలుకెళ్లి చంద్రబాబును కలిసిన తర్వాతే ఆయన గ్రాఫ్ పెరిగిందని , చంద్రబాబు ను జైలు కు తీసుకొనివెళ్ళితే టీడీపీ వారు ఎవరు బయటకు రాలేదని తాను చెప్పానని.. దీంతో చంద్రబాబు తనపై కోపం పెంచుకున్నారని అన్నారు. పవన్ తన ఇంటికి రావాలని అనుకున్నప్పటికీ చంద్రబాబు అనుమతి ఇవ్వలేదన్నారు.. సీఎం జగన్ ఆలోచనలు, మాట ఇచ్చాడంటే నిలబడే తత్వం, బలమైన వ్యక్తిత్వం తనను ఆకర్శించాయని అందుకే తాను వైసీపీలో చేరానని చెప్పారు. రాష్ట్రంలో బలమైన అభ్యర్థులకే జగన్ టికెట్లు ఇచ్చారని తెలిపారు. మరో 30 ఏళ్లు జగనే అధికారంలో ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఏపీకి ప్రత్యేకహోదా తదితర అంశాలపై బీజేపీలో చేరేందుకు తాను సిద్ధమని ఆ పార్టీ నేతలకు తాను చెప్పానని.. అయితే వారి నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో తాను వైసీపీలో చేరానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *