సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం బీజేపీ ఎంపీ టికెట్ ను మరల తనకు కేటాయిస్తారని ఎంపీ రఘురామా కృష్ణంరాజు భీమవరంలో ఆశాభావం వ్యక్తం చేయడంపై, మీడియాలో వస్తున్నా వార్తలపై బీజేపీ ఏపీ అడ్జక్షురాలు పురంధరేశ్వరి తీవ్ర విస్మయం వ్యక్తం చేసారు. ఆమె నేడు, శుక్రవారం మీడియా తో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ అధిష్టానం ప్రధాని మోడీ, అమిత్ షా తదితర పెద్దలు పార్లమెంటరీ బోర్డు సమావేశం అయ్యి నరసాపురం ఎంపీ అభ్యర్థిగా 30 ఏళ్లకు పైగా బీజేపీ కి సేవలు అందిస్తున్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కు సీటు కేటాయిస్తే ఇప్పడు ఆ సీటు మారుస్తారని ఆశ పడటం భావ్యం కాదని, అది అంత సులభమైన విషయం కాదని ఎంపీ రఘురామా గమనించాలన్నారు. ఇప్పటికే సిటు కేటాయించక మరోసారి అభ్యర్థిని మార్చాలంటే మరల బీజేపీ కేంద్ర పెద్దల సమావేశంలో నిర్ణయం తీసుకొంటేనే అది సాధ్యం అవుతుందని.. ఇప్పటికే అన్ని అలోచించి శ్రీనివాస వర్మ కు కేటాయించిన టికెట్ మార్చడం కుదరని తేల్చి చెప్పారు పురంధరేశ్వరి.. మరో ప్రక్క ఎన్నికల ప్రచారంలో ఉన్న శ్రీనివాస వర్మ జిల్లాలోని టీడీపీ జనసేన పెద్దలతో తన సుదీర్ఘ పరిచయాలు దృష్ట్యా వారి మద్దతుతో, ప్రజాబలంతో అవలీలగా ఎన్నికలలో గెలుపు సాధిస్తానని ధీమాగా ఉన్నారు.
