సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో జగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల్లో ఉంటూ పోలింగ్‌ రోజు బూత్ కి వచ్చి ఓటు వెయ్యలేని 33 నిత్యావసర సేవల శాఖల ఉద్యగులకు సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశాన్ని కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ప్రకటించారు. ‘జిల్లాలో ఈ పోస్టల్‌ బ్యాలెట్‌పై ప్రత్యేకంగా నోడల్‌ అధికారిని నియమించడంతోపాటు ఫారం 12డిలను అందుబాటులోఉంచాం. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే అవకాశం పొందిన శాఖలు మెట్రో, రైల్వే రవాణా (ప్రయాణికులు, సరుకు రవాణా) సేవలు, పోలింగ్‌ రోజు కార్యకలాపాలను కవర్‌ చేయడానికి కమిషన్‌ ఆమోదంతో అధికార లేఖలు జారీ పొందిన మీడియా, విద్యుత్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, పోస్టల్‌, టెలిగ్రామ్‌, దూరదర్శన్‌, ఆలిండియా రేడియో, రాష్ట్ర మిల్క్‌ యూనియన్‌, మిల్క్‌ కో ఆపరేటివ్‌ సొసైటీలు, ఆరోగ్య శాఖ, ఫుడ్‌ కార్పొరేషన్‌, విమానయానం, రోడ్డు రవాణా సంస్థ, అగ్నిమాపక సేవలు, ట్రాఫిక్‌ పోలీస్‌, అంబులెన్స్‌, షిప్పింగ్‌, ఫైర్‌ ఫోర్స్‌, జైళ్లు, ఎక్సైజ్‌, వాటర్‌ అథారిటీ, ట్రెజరీస్‌, అటవీ, సమాచార ప్రజా సంబంధాలు, పోలీసు, పౌరరక్షణ, హోం గార్డు, ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, ఎనర్జీ(పవర్‌), ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పీడబ్ల్యూడీ, నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్స్‌, విపత్తు నిర్వహణ తదితర శాఖలు అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వెయ్యవచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *