సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నందున వలంటీర్లను వాడుకొని ఏపీ అసెంబ్లీ ,లోక్‌సభ ఎన్నికల్లో అధికార వైసీపీ ప్రజల నుండి లబ్ది పొందాలను కొంటుందని కనుక దీనిని నిరోధించాలని . ‘సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ’ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని, టీడీపీ నేత వర్ల రామయ్య, నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషన్ వద్ద చేసిన పిటిషన్ పరిశీలించిన కేంద్ర ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకొంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు చెందిన నగదు పంపిణీ నుంచి వలంటీర్ల చేత పంపిణి చెయ్యడం నిషేధిస్తున్నట్టు ఆదేశాల్లో ఎన్నికల సంఘం పేర్కొంది. వాలంటీర్లుకు ఇచ్చిన మొబైల్ ఫోన్లు, టాబ్‌లు జిల్లా ఎన్నికల అధికారి వద్ద డిపాజిట్ చేయాలని సూచించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నంతవరకు యంత్రాలు డిపాజిట్‌లో ఉండాలని కమిషన్ ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం తన రెగ్యులర్ ఉద్యోగుల ద్వారా సంక్షేమ పథకాల నిధులు పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
