సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి హుండీ లను నేడు, శనివారం తెరిచి లెక్కించగా గత 45 రోజులకి గాను శ్రీ అమ్మవారికి భక్తులు హుండీలో చెల్లించిన నగదు 40,82,260 రూపాయలు ఆదాయం లభించగా ,బంగారం 67 గ్రాముల 100 మిల్లి గ్రాములు, వెండి 165 గ్రాములు వచ్చినవి.ఈ హుండీ లెక్కింపు లో తనిఖీదారు దేవదాయ ధర్మదాయశాఖ భీమవరం వి వేంకటేశ్వరరావు మరియు కార్యనిర్వహణధికారి శ్రీ శక్తీశ్వరస్వామి ఆలయo కర్రీ శ్రీనివాస్ పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియజేసారు,
