సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి పంచా రామ క్షేత్రం వద్ద వేంచేసి ఉన్న శ్రీ సీతారామ స్వామి వారి ఆలయంలో శ్రీ సీతాసమేత శ్రీరామచంద్రుని విరాట్ విగ్రహాలకు నేడు, శనివారం ( ది.. 30. 3. 2024. ) సుమారు 12 న్నర కేజీల వెండి మకరకరణం , మరియు వెండి ఛత్రం ను భక్తులు సహకారంతో సమర్పించడం, పురోహితుల వేదమంత్రాల తో వాటిని ఆలయంలో అలంకరించడం జరిగింది. ఈ వెండి మకర తోరణం కోసం భక్తులు పొత్తూరి వెంకటేశ్వర్లు , పుష్ప కుమారి దంపతులు వారి కుమారుడు వెంకట శ్రీనివాస్, తులసి దంపతులు 5 కేజీల వెండి కానుకగా సమర్పించగా, కట్రెడ్డి వెంకటేశ్వర రావు , వెంకట లక్ష్మి దంపతులు, 2న్నర కేజీల వెండి సమర్పించగా మిగతా భక్తుల సహకారంతో 12న్నర కేజీల వెండితో శ్రీ సీతారామాలయం అభివృద్ధి ట్రస్ట్ గునుపూడి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ను నిర్వహించి భక్తులకు తీర్ధ ప్రసాదాలు వితరణ చేసారు.
