సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం కుర్రాడు ప్రముఖ పాన్ ఇండియా సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జ కాంబోలో వచ్చిన సినిమా హనుమాన్. ఎలాంటి అంచనాలు లేకుండా సంక్రాంతి కానుకగా దేశంలో 300 కోట్లపైగా అత్యధిక వసూళ్లను కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది. ముందుగా ప్రకటించినట్లే .. ఇక ఈ మూవీకి సీక్వెల్ గా. ‘‘వెల్‌కమ్ టు అంజనాద్రి 2.0’ అంటూ తాజాగా సీక్వెల్ సంబంధించి క్రేజీ అప్డేట్ వదిలారు. అంతేకాదు ఈ యంగ్ డైరెక్టర్. ‘‘వెల్‌కమ్ టు అంజనాద్రి 2.0’’ అనే హ్యాష్ ట్యాగ్ తో ఆసక్తికరమైన వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో చుట్టూ అందమైన కొండలు.. మధ్యలో పెద్ద నది.. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూపిస్తూ.. దానికి ‘హనుమాన్ మూవీలోని ‘రఘునందన’ పాటను జోడించారు. జై హనుమాన్ నుంచి వచ్చిన ఈ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాల్ వైరల్ గా ఊపేస్తుంది. దేశవ్యాప్తంగా అగ్ర తారాగణం నటించనున్నారని సమాచారం.
