సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి ఆదివారం ఉదయం ఈస్టర్ పర్వదినం సంధర్భంగా భీమవరం గునుపూడి, గరువు పేట సమాధుల తోట మరియు రెస్ట్ హౌస్ రోడ్ లోని లూథరన్ చర్చ్ సమాధుల తోటలో, ప్రకాశం చౌకులోని రూపాంతర దేవాలయం, చిన్నపేటలోని కల్వరి దేవాలయలలో జరిగిన ప్రార్ధనలలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరియు నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్దిని శ్రీమతి గూడూరి ఉమాబాల, పాల్గొన్నారు. వీరికి పాస్టర్లు ప్రభువు అస్సిసులు కోరుతూ ప్రత్యేక ప్రార్ధనలు చేసారు. వీరితో పాటు రాష్ట్ర క్రిష్టియన్ మైనారిటీ సెల్ చైర్మన్, మేడిది జాన్సన్, వైసీపీ పట్టణ అడ్జక్షులు తోటబోగయ్య తదితర వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
