సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, ఆదివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా జడ్జి సి. పురుషోత్తం కుమార్ దంపతులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ శ్రీ అమ్మవారి శేషవస్త్రం,ప్రసాదం, ఫోటో అందజెయ్యడం జరిగింది.
