సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో తాజగా మావోయిస్టు రాహుల్ కేసరి అరెస్ట్ సంచలనం రేపింది. పోలీస్ శాఖ వారి వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 4గురు కీలక నక్సల్స్ ఇటీవల అరెస్ట్ కావడంతో వారితో పాటు ఉన్న రాహుల్ అనే మావోయిస్టు అక్కడ నుండి తప్పించుకొని హైదరాబాద్ లో కొంతకాలం నివాసం ఉండి, తనపై నిఘా పెరగటంతో అక్కడ నుండి ప్రశాంతంగా ఉండే భీమవరం పట్టణానికి గత 15 రోజుల క్రితం వచ్చి ఇక్కడ తాపీమేస్త్రి గా పనిచేస్తున్నట్లు మార్కెట్ యార్డ్ వద్ద నివాసం ఉంటున్నట్లు అతడి సెల్ ఫోన్ సిగ్నెల్స్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. నిఘా వర్గాలకు భీమవరం వన్ టౌన్ పోలీసులు సహకరించారు, అంతే మావోయిస్టు రాహుల్ కేసరి చిక్కారు. ఈ విషయం తెలిసి స్థానికులు ఆందోళన చెందారు.
