సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఈసీ ఆదేశాలతో వాలంటీర్లు ఎన్నికలు కోడ్ ముగిసేవరకు వృద్దులకు అర్హులయిన లబ్దిదారులకు పింఛన్ల పంపిణీ చెయ్యకూడదని ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ సచివాలయ అధికారులకు సెర్ప్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో మాత్రమే సచివాలయాల్లో పింఛన్లు పంపిణీ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. లబ్ది దారులు స్వయంగా సచివాలయాలకు వచ్చి వారి పింఛన్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. పింఛను లబ్ధిదారులు ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డు తీసుకెళ్లి పెన్షన్లు తీసుకోవాలని సెర్ప్ తెలిపింది. దీనితో వాలంటీర్లు ఇంటికి రాకపోవడంతో పించన్ లబ్ధిదారులు సచివాలయాలకు తప్పనిసరిగా వెళ్లవలసిందే..
