సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఏకంగా 22 మంది వాలంటీర్లు తమ పోస్టులకు వారు మూకుమ్మడి రాజీనామా చేశారు. పట్టణంలోని 39 వార్డులో మొత్తం 22మంది వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. విధుల్లో అడుగడుగునా టీడీపీ, జనసేన శ్రేణులు ఫోటోల పేరుతో వేధిస్తున్నారని వాలంటీర్లు ఆరోపించారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని..ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ను కలిసి రాజీనామా విషయం తెలిపిన వాలంటీర్లు ఆయనకు ఎన్నికల్లో మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. టీడీపీ జనసేన పార్టీలలలో నాయకులను ప్రక్కన పెట్టి కార్యకర్తలు సైతం ఆలోచించాలని.. వాలంటీర్లు వల్ల ఎంత మేలు జరిగిందో.. కరోనా సమయంలో రాజకీయ పార్టీల పేరుతొ మీ ఇంట్లోవారికి వాలంటీర్లు సేవలు అందించకుండా ఉన్నారా? వారి ప్రాణాలు ప్రాణంగా పెట్టి అందరికి మేలు చేసారు. జగన్ సర్కార్ నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడికి మంచి జరగాలని, అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు వాలంటీర్లు అందిస్తున్నారు. అలాంటి వారి గురించి చంద్రబాబు, పవన్ కల్యాణ్.. దారుణంగా అవమానకరంగా మాట్లాడారు. ఈ రోజు ఏప్రిల్ 1వచ్చింది మరి పేదలకు, వృద్దులకు పెంక్షన్ లు ఎలా ఇస్తారు. చంద్రబాబుకి సంబంధించిన మనుషులు నిమ్మగడ్డ రమేశ్, వర్ల రామయ్య.. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయడం, ఎన్నికల కోడ్ తో వాలంటీర్ వ్యవస్థ సేవలను అడ్డుకొన్నారు. కోవిడ్ సమయంలో చంద్రబాబు పవన్ మన రాష్ట్రమే రాకుండా తెలంగాణాలో వాళ్ళ ఇండ్లలో హాయిగా సేద తీరారు. ఇక్కడ వాలంటీర్లు చేసిన సేవలను మర్చిపోయిన దుర్మార్గులు వారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లపై కక్ష కడతారా? ఇటువంటి దుర్మార్గులు ను మనిషి జన్మ ఎత్తిన ఎవరు క్షమించరు అని ఆగ్రహం వ్యక్తం చేసారు గ్రంధి శ్రీనివాస్.. గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వెంప గ్రామంలో నుండి సానబోయిన సత్యనారాయణ,దంపనబోయిన సుబ్బారావు, తదితరులు టీడీపీ జనసేన నేతలు సుమారు 100 మంది వై.యస్స్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రకటించారు.
