సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం జనసేన టీడీపీ, బీజేపీ ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశంలో… కూటమి అభ్యర్థి అంజిబాబు మాట్లాడుతూ.. ప్రజలు ఆలోచించాలని.. జగన్ లో ఫ్యాక్షనిస్టు ఉన్నాడని విద్వంసాలు తప్ప అభివృద్ధి చెయ్యలేరని, అందుకే నిజాయతి పరులైన పవన్ కళ్యణ్, చంద్రబాబు లాంటి నాయకుల పార్టీల కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రప్రజలకు మేలు జరుగుతుందని పిలుపు నిచ్చారు. భీమవరంలో తనను టి గ్లాస్ గుర్తు ఫై ఓటు వేసి ప్రజలు , కూటమి నేతలు గెలిపిస్తే పట్టణం ను అవినీతికి దూరంగా మరింత అభివృద్ధి పధంలో నడిపిస్తానని అన్నారు.ఇక భీమవరం పట్టణం స్థానిక 10వ వార్డు నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వార్డు అధ్యక్షులు మింది అప్పనమూర్తి గారి ఆధ్వర్యంలో వైయస్సార్ పార్టీ కార్యకర్తలు సుమారు 30 మంది మాగపూ ప్రసాద్ నాయకత్వములో జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) ,భీమవరం అసెంబ్లీ అభ్యర్థి అంజిబాబు సమక్షంలో జనసేన పార్టీ లో చేరారని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్ర శేఖర్, సుంకర రవి,వార్డు సభ్యులు నూకరాజు, ఆరుగొలను పద్మ,బోనం శ్రీను,నాయకులు వానపల్లి సూరిబాబు ,ఆకుల శ్రీను , రాంప్రసాద్,అప్పారావు,త్రివిక్రమ్ ,తదితరులు పాల్గొన్నారు.
