సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం రాయలం మరియు కొమరాడ గ్రామాలలో ఏర్పాటు చేసిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్దిని, గూడూరి ఉమాబాల, స్ధానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కుల, మత, పార్టీలకు అతీతంగా అందరికీ మేలు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, రాబోయే ఎన్నికల్లో ప్రతి ఓటర్ కూడా వారి రెండు ఓట్లను( అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులకు ) ఫ్యాను గుర్తుపై వేసి తమను గెలిపించాలని కోరారు. అనంతరం కొమరాడ గ్రామంలో టిడిపి, జనసేన పార్టీ నుండి వైఎస్ఆర్సీపీ లో చేరిన పలువురిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
