సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేటి ఆదివారం మధ్యాహ్నం స్థానిక ASR కళ్యాణ మండపం నందు జనసేన టిడిపి బిజెపి పార్టీల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశానికి సుమారు 2వేల మంది కూటమిపార్టీల క్యాడర్ హాజరు అయ్యారు. ఈ సమావేశానికి సభా అధ్యక్షులుగా జనసేన పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్ వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి అంజిబాబు మరియు నరసాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ మరియు జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు గోవిందరావు, తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు తోట సీతారామలక్ష్మి,బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాక సత్యనారాయణ వేదికపై అస్సినులయ్యారు. వక్తలు మాట్లాడుతూ.. కూటమిలోని ప్రతి ఒక్కరు బాధ్యత గా అందరితో ఓటు వేయించాలి . ఎమ్మెల్యే, ఎంపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రానున్నది ఉమ్మడి ప్రభుత్వమే అని సమిష్టిగా కృషి చేస్తే మంచి రోజులు వస్తాయని పిలుపు ఇచ్చారు. . ఉమ్మడి అభ్యర్థులు అంజిబాబు, ఎంపీ అభ్యర్థి వర్మ మాట్లాడుతూ .. కూటమి నేతల మద్దతు కావాలని ప్రతి ఒక్కరినీ ఓటు వేయాలని ఆహుతులను స్వయంగా అభ్యర్థించారు, ఈ కార్యక్రమంలో పులపర్తి ప్రశాంత్ , వెండ్ర శ్రీనివాస్, ఇర్రింకి సూర్యారావు,ఇందుకూరి రామలింగరాజు, గాదిరాజు తాత రాజు, బండి రమేష్,సుంకర రవి, పత్తి హరి, మగాపు ప్రసాద్ , వానపల్లి సూరిబాబు,త్రివిక్రమ్, మాజీ కౌన్సెలర్స్. చెల్లబోయిన సుబ్బారావు,కటికాల పల్లారావు, ఏద్దు ఏసుపాధం, నౌషాద్, పామర్థి వెంకట్రామయ్య , హైజాక్ బాబు, చంద్ర శేఖర్ మరియు జనసేన,తెలుగుదేశం ,బీజేపీ నాయకులు ,కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద యెత్తున పాల్గొన్నారు. నేటి సాయంత్రం వీరవాసరం లో కూటమి సమన్వయ సమావేశం నిర్వహించడం గమనార్హం..
