సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. పిఠాపురం అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న పవన్ కళ్యాణ్ గొల్లప్రోలు బైపాస్‌లోని పార్టీ కార్యకర్తకు చెందిన భవనంలో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. తన స్వగృహంలో ఉగాది వేడుకలు, పంచాగ శ్రవణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భముగా నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు హాజరయి పవన్ కు శాలువాకప్పి శుభాకాంక్షలు తెలిపారు.
