సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఎన్నికల ప్రచారం వేసవితో పాటు వేడెక్కిపోతుంది. అభిమానులు అయినా సరే.. ఎవరైనా తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తే మరింత వేడెక్కిపోయే నందమూరి బాలకృష్ణ గురించి అందరికి తెలిసిందే..ఈ రోజు శనివారం నుంచి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ప్రచారానికి సిద్ధం అయ్యారు.. కదిరిలో ప్రచారాన్ని ప్రారంభించి.. ఉమ్మడి అన తపురం జిల్లాలో రెండు రోజుల పాటు ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తారు. అయితే ఎన్నికల ముంగిట కూడా అభిమానులపై తన చేతి వాటం మరోసారి ప్రదర్శించారు బాలయ్య.. శ్రీ సత్య సాయి జిల్లాలో కదిరిలో బాలకృష్ణ వచ్చిన హెలికాప్టర్ ల్యాండ్ అవ్వగానే.. హెలీప్యాడ్ దగ్గరకు ఒక్కసారిగా దూసుకొచ్చారు అభిమానులు.. జైజై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు.. ఈ సమయంలో సెల్ఫీ దిగేం దుకు ప్రయత్నించిన ఒక అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలకృష్ణ తనదయిన శైలి లో పట్టరాని కోపంతో చేయి కూడా చేసుకున్నారు.. దీనితో అక్కడి చేరిన అభిమానులు అవాక్కయ్యారు. కదిరి లక్ష్మీనరసింహస్వా మిని దర్శించుకోనున్న బాలయ్య నేటి నుండి ;స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో బస్సు యాత్ర నిర్వహించనున్నారు.. దీని కోసం ప్రత్యేక బస్సు ను సిద్ధం చేశారు..
