సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న ధరలు ఇక సామాన్యులకు వాటి కొనుగోలును పూర్తీ దూరం చేసే రోజులు ఎంతో దూరంలో లేవనివిపిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వరుసగా నాలుగో రోజు కూడా ర్యాలీని కొనసాగించి కొత్త రికార్డులకు దూసుకుపోయాయి. గత శుక్రవారం 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,050 మేరకు పుంజుకుని రూ.73,350 వద్ద స్థిరపడింది. వెండి కిలో ధర ఒక్కసారిగా రూ.1,400 పెరిగి రూ.86,300 వద్ద ముగిసింది. బంగారం, వెండి ధరలు రెండూ రికార్డు స్థాయిలో గరిష్ఠ స్థాయిలే. అంతర్జాతీయ విపణిలో కూడా ఔన్సు బంగారం స్పాట్ మార్కెట్లో 48 డాలర్లు పెరిగి 2,388 డాలర్లకు చేరింది. వెండి కూడా ఔన్సు 28.95 డాలర్లు చేరింది.
