సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కేంద్ర అధినాయకత్వం నేడు, ఆదివారం తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా, అధునాతన దేశంగా భారత్ అవతరించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ మేనిఫెస్టోలో కీలక అంశాలు ఇవే.. వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేసే దిశగా కృషి.. దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం.. ట్రాన్స్జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్ మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులకు మార్చే ప్రణాళిక.. ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపుడెయిరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంపు.. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం.. దేశంలో టూరిజం అభివృద్ధి… 6జి టెక్నాలజి దేశంలో అమలుకు సిద్ధం… పెట్రోల్ ధరలు తగ్గిస్తాం. పెట్రోలు వినియోగాన్ని అవకాశం ఉన్నంత మేరకు తగ్గిస్తాం.. 2036లో ఒలింపిక్స్ దేశంలో నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తాం… 70 ఏళ్లు పైబడిన వృద్ధిలకు ఆయుష్మాన్ భారత్లో భాగంగా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం… పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు కట్టించడం… పైపు ద్వారా ఇంటింటికీ గ్యాస్ అందజేతట్రక్ డ్రైవర్ల కోసం హైవేల వెంట సదుపాయాలు… వన్ నేషన్ వన్ ఎలక్షన్, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు… నూతన రైళ్లు, హైవేలు, విమానాశ్రయలు, మౌళిక సదుపాయాల కల్పన వంటి లక్ష్యాలతో బీజేపీ మ్యేనిపెస్టో లో పెట్టింది.
