సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పని సర్దుబాటు (వర్క్ అడ్జస్ట్మెంట్)కింద డిప్యూటేషన్లపై ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ ఈ నెల 23న తిరిగి తమ తమ పాతస్థానాల్లో విధుల్లో చేరాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు తాజాగా ఆదేశాలు జారీచేశారు. గతేడాది అక్టోబర్లో టీచర్లను కొరతవున్న పాఠ శాలలకు వర్క్ అడ్జస్ట్మెంట్ కింద తాత్కాలికంగా డిప్యూ టేషన్లపై నియమించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం ఉమ్మడి జిల్లాలో సుమారు 200 మందికిపైగా ఉపాధ్యాయులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి పనిదినం ఈనెల 23న వర్క్ అడ్జస్ట్మెంట్/ డిప్యూటేషన్ టీచర్లందరినీ రిలీవ్ చేసి వారు జీతం డ్రా చేసే పాఠశాలల్లో రిపోర్టు చేయాలని ఆదేశించడంతో ఆ మేరకు ఆదేశాలు పాటించవలసి ఉంది. డైట్ కేంద్రాలు, సమగ్రశిక్షలో డిప్యూటేషన్లపై పనిచేస్తున్న వర్క్ అడ్జస్ట్మెంట్ టీచర్లకు, హెచ్ఎంలకు మాత్రం మినహాయింపు ఇచ్చినందున. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వారు కొనసాగే అవకాశం ఉంది.
