సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేడ్కర్ జయంతిని భీమవరం DNR కళాశాలలో నేడు, ఆదివారం ఘనముగా నిర్వహించారని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సోమరాజు తెలిపారు. ఈ కార్యక్రమమునకు, కళాశాల ఉపాధ్యక్షులు, గోకరాజు పాండురంగరాజు హాజరు అయ్యి, కళాశాల ప్రాంగణములోని డా.బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనముగా నివాళులు అర్పించి డా.బి.ఆర్. అంబేడ్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. డా.బి.ఆర్. అంబేడ్కర్ “భారత రాజ్యాంగ పితామహుడు” అని కొనియాడారు. ఈ కార్యక్రమములో కళాశాల పరిపాలనాధికారి పి. రామకృష్ణంరాజు , కళాశాల విశ్రాంత అధ్యాపకుడు పి. సంజీవ రావు, మోజెస్, గౌతం కుమార్, హరికృష్ణం రాజు, ఎన్.ఎస్.ఎస్. అదికారులు కె.సోమయ్య, ఎస్. అనిల్ దేవ్, సిహెచ్. రంగారావు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది విధ్యార్దులు పాల్గొని డా.బి.ఆర్. అంబేడ్కర్ కు ఘనముగా నివాళులు అర్పించారు.
